హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ) : అడవుల రక్షణతోపాటు అకడ నివసించే గిరిజనుల రక్షణ బాధ్యతా అటవీ అధికారులు తీసుకోవాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్‌నాయక్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని అరణ్యభవన్‌లో అటవీశాఖ అధికారులతో సమావేశమయ్యారు. అటవీశాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్‌నదీం, ముఖ్య రక్షణాధికారి ఆర్ఎం డోబ్రియల్ ఆధ్వర్యంలో డీఎఫ్‌వోలు, ఇతర ఉన్నతాధికారులతో ఎస్టీ కమిషన్ సభ్యులు సమావేశమయ్యారు. అంతకు ముందు అటవీశాఖ, గిరిజన అధికారులతో హుస్సేన్‌నాయక్ ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. అడవుల్లో గిరిజనులు ఎదురొంటున్న సమస్యలపై చర్చించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హుస్సేన్‌నాయక్ మాట్లాడు తూ.. తాను కూడా అడవి నుంచి వచ్చి న గిరిజన బిడ్డనేనని, వారి బాధలు తనకు తెలుసని చెప్పారు. గిరిజనులకు పట్టాలు ఇచ్చిన అధికారులు ఆ భూము ల్లో బోర్లు వేయకుండా, కరెంట్ కనెక్షన్ ఇవ్వకుండా అడ్డుపడుతున్నట్టు తెలిసిం దన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ అదనపు కార్యదర్శి ప్రశాంతి, పీసీసీఎఫ్(వైల్డ్ లైఫ్) ఎలిసింగ్ మేరు, పీసీసీఎఫ్(అడ్మిన్) సునీతాభగవత్, సీసీఎఫ్(ఐటీ) ప్రియాంక వర్గీస్ పాల్గొన్నారు.