చిక్కడపల్లి, జూలై 19 : అసెంబ్లీ ఎన్నికల ముందు దేశ ప్రధాని హోదాలో మోదీ తెలంగాణకు వచ్చి ఎస్సీ వర్గీకరణ చేపడుతామని ఇచ్చిన హామీని వెంటనే అమలుచేయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ డిమాండ్ చేశారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ఎస్సీ వర్గకరణ చేపట్టాలని ఆగస్టు 6,7,8 తేదీల్లో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద దీక్షలు చేపట్టనున్నట్టు తెలిపారు. శుక్రవారం విద్యానగర్‌లోని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. వంద రోజుల్లో వర్గీకరణ చేస్తామని బీజేపీ ఆ ఆంశాన్ని కోల్డ్ స్టోరేజ్‌లో పెట్టిందని ఆరోపించారు.
తాజాగా పార్లమెంట్లో బిల్లు పెట్టకుండా కమిటీ వేసి కాలయాపన చేస్తున్నదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ జాప్యాన్ని, మోసాన్ని ఎండగట్టేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ యువసేన రాష్ట్ర అధ్యక్షుడు పొట్టపెంజర రమేశ్మాదిగ, ఎమ్మార్పీఎస్ ఉపాధ్యక్షుడు శ్యామ్‌రావు, ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కోల్లూరు వెంకట్, ప్రధాన కార్యదర్శి గుమిడేలి తిరుమలేశ్, లక్ష్మణ్, ప్రేమదాస్, రాజు, నరేశ్, నాగరాజు పాల్గొన్నారు.