మెదక్ : జిల్లాలోని ఏడుపాయల వన దుర్గమాత జాతర నిర్వహణకు ప్రభుత్వం రూ. రెండు కోట్లు మంజూరు చేసింది. భక్తులకు మౌలిక వసతుల కల్పనకు నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేయగా వెంటనే స్పందించి రూ. రెండు కోట్లు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్కు మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ నిధులతో భక్తులకు సౌకర్యాలు కల్పిస్తామని వెల్లడించారు. తెలంగాణలో సమ్మక్క సారలమ్మ జాతర తర్వాత రెండవ అతిపెద్ద జాతరగా ఏడుపాయల జాతర జరుగుతుందని వివరించారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ పండుగలు, జాతరలు వైభవంగా జరుగుతున్నాయని ఆమె పేర్కొన్నారు. ఈ జాతరకు తెలంగాణ రాష్ట్ర ప్రాంతీయులే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారని అన్నారు.