పెద్దేముల్, జూలై 12: వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండ ల పరిధిలోని కందనెల్లి తండా ప్రాథమిక పాఠశాలలో ఫుడ్ పాయిజన్తో 18 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలో 33 మంది విద్యార్థులు ఉండగా, శుక్రవారం 31 మంది హాజరయ్యారు. మధ్యా హ్న భోజనంలో విద్యార్థులకు పులిహోరను వడ్డించారు. 18 మందికి ఒక్కసారిగా కడుపునొప్పి వచ్చి వాంతులయ్యాయి. విద్యార్థుల కు తాండూరులోని మాతాశిశు సంరక్షణ కేంద్రంలో చికిత్సను అందించగా 14 మంది కోలుకున్నారు. నలుగురు విద్యార్థులు వైద్యు ల పర్యవేక్షణలో ఉన్నారు. ఫుడ్ పాయిజనే అస్వస్థతకు కారణమని వైద్యులు తెలిపారు.