ఖమ్మం అర్బన్, మార్చి 4 : ఖమ్మం నగరంలోని ఓ జూనియర్ కళాశాల విద్యార్థినులకు ఫుడ్ పాయిజన్ కావడంతో దవాఖానకు తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మంలోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాల హాస్టల్లో ఉంటూ ద్వితీయ సంవత్సరం చదువుకుంటున్న నవ్య, నందిని, కల్యాణి మంగళవారం ఉదయం ఉదయం కడుపునొప్పితోపాటు వాంతులు చేసుకున్నారు. దీంతో సిబ్బంది వెంటనే దవాఖానకు తరలించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు దవాఖానకు వెళ్లి చికిత్స అనంతరం విద్యార్థినులను తమ ఇండ్లకు తీసుకెళ్లారు. ఈ ఘటనపై కళాశాల బాధ్యులను వివరణ కోరగా.. వారు ముగ్గురు ఆదివారం బయట ఫుడ్ తినడంతో కడుపులో నొప్పి వచ్చిందని తెలిపారు.
కొత్తగడి ఘటనపై బీసీ కమిషన్ సీరియస్
హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): వికారాబాద్ జిల్లా కొత్తగడి సాంఘిక సంక్షేమ హాస్టల్ ఘటనపై బీసీ కమిషన్ సీరియస్ అయ్యింది. ఉపాధ్యాయుల వేధింపులతో పదో తరగతి విద్యార్థిని తబిత పాఠశాల భవనం పైనుంచి దూ కగా కాలు విరిగింది. ఘటనకు సంబంధించి విచారణ చేపట్టి పది రోజుల్లోగా నివేదిక సమర్పించాలని కలెక్టర్, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ కార్యదర్శి అలుగు వర్షిణికి మంగళవారం బీసీ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశంలో కారణాలు తెలుసుకుని దిద్దుబాటు చర్యలు చేపట్టాలని కమిషన్ అదేశించింది.