Godavari | భద్రాద్రి కొత్తగూడెం : ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరికి వరద పోటెత్తింది. గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతుంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 39.9 అడుగులకు చేరింది. రాత్రి వరకు గోదావరి ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉంది.
గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో.. భద్రాచలం వాసులను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. నది వైపునకు ఎవరూ వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.