శ్రీశైలం : శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం స్వల్పంగా కొనసాగుతూ ఉంది. మంగళవారం జూరాల ప్రాజెక్టు విద్యుత్ ఉత్పత్తి ద్వారా 31,578 క్యూసెక్కులు, సుంకేసుల నుండి 25,032, హంద్రీ నుండి 250 క్యూసెక్కుల నీరు విడుదల కాగా సాయంత్రానికి జలాశయానికి 96,384 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా నమోదయింది.
అదే విధంగా ఏపీ పవర్‌హౌస్‌లో 32,204 క్యూసెక్కులు, టీఎస్ పవర్‌హౌస్‌లో 31,784 క్యూసెక్కుల నీటితో విద్యుత్ ఉత్పత్తి చేసి, దిగువన ఉన్న నాగార్జున సాగర్‌కు విడుదల చేశారు. జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ 885 అడుగులు కాగా, ప్రస్తుతం 881.80 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిసామర్థ్యం 215 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 197.9120 టీఎంసీలుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.