నాగర్కర్నూల్ : శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం భారీగా పెరిగింది. ప్రాజెక్టు ఇన్ఫ్లో 1.29 లక్షల క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 41,973 క్యూసెక్కులు. జలాశయం ప్రస్తుత నీటిమట్టం 880.5 అడుగులు కాగా, పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. శ్రీశైలం జలాశయంలో ప్రస్తుతం 190.77 టీఎంసీల నీరు ఉండగా, పూర్తిస్థాయి సామర్థ్యం 215.8 టీఎంసీలు. శ్రీశైలం కుడి, ఎడమగట్టు కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు.