హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు విద్యుత్తు పంపిణీ సంస్థలకు తీవ్ర ఆస్తినష్టం వాటిల్లింది. టీజీ ఎస్పీడీసీఎల్ పరిధిలో నాలుగు సబ్స్టేషన్లు నీటమునిగాయి. 419 విద్యుత్తు స్తంభాలు విరిగిపోయాయి. మొత్తంగా 16 సబ్స్టేషన్లలో, 75 చోట్ల 33 కేవీ ఫీడర్లు, 37 చోట్ల 11కేవీ ఫీడర్లలో నష్టం వాటిల్లింది. టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో 218 విద్యుత్తు స్తంభాలు విరిగిపోయాయి.