ములుగు, జనవరి 30 (నమసే ్తతెలంగాణ) : చదువున్నా కొలువు లేదంటూ మేడారంలో నిరుద్యోగ యువత ఫ్లెక్సీ కట్టింది. ‘జై సమ్మక్క తల్లి.. జై సారక్క తల్లి. డిగ్రీలు, బీటెక్లు చేసినా.. జాబ్ నోటిఫికేషన్లేక మేడారంలో చిరువ్యాపారం చేసేందుకు వచ్చాం.. పెద్ద మనసు చేసుకొని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాం’ అంటూ ఫ్లెక్సీపై రాయించారు. అది చూసిన భక్తులు ఉద్యోగాలు రాక యువ త ఇబ్బందులపై చర్చించుకున్నారు.