విద్యుత్తు కనెక్షన్లకు కొత్త రూల్స్.. మార్గదర్శకాలు విడుదల చేసిన ఈఆర్సీ
రాష్ట్రంలో కొత్త విద్యుత్తు కనెక్షన్ల జారీకి ఈఆర్సీ (విద్యుత్తు నియంత్రణ మండలి) నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇది వరకు విద్యుత్తు లైన్ నుంచి వినియోగదారుడి ఇంటి వరకు లైన్ వేసేందుకయ్యే వ్యయాన్ని వినియోగదారులే భరించాల్సి వచ్చేది. విద్యుత్తు స్తంభాలు, లైన్ల ఏర్పాటు కోసం దూరాన్ని బట్టి అధికారులు అంచనాలు రూపొందించే వారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొత్త విద్యుత్తు కనెక్షన్ల జారీకి ఈఆర్సీ (విద్యుత్తు నియంత్రణ మండలి) నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇది వరకు విద్యుత్తు లైన్ నుంచి వినియోగదారుడి ఇంటి వరకు లైన్ వేసేందుకయ్యే వ్యయాన్ని వినియోగదారులే భరించాల్సి వచ్చేది. విద్యుత్తు స్తంభాలు, లైన్ల ఏర్పాటు కోసం దూరాన్ని బట్టి అధికారులు అంచనాలు రూపొందించే వారు. వాటి ఆధారంగా వినియోగదారుల నుంచి చార్జీలు వసూలు చేసేవారు. కానీ, ఇక నుంచి ఎలాంటి అదనపు చెల్లింపులు ఉండవు.
వ్యవసాయ కనెక్షన్లకు సంబంధించి అన్ని లోడ్లకు కిలోవాట్‌కు రూ.1,000 మాత్రమే వసూలు చేస్తారు. అయితే ఈ మార్గదర్శకాల పేరిట టర్న్‌కీ విధానాన్ని ఎత్తివేసే కుట్ర జరుగుతున్నదని, దీంతో అన్ని పనులు డిస్కమ్ అధికారుల చేతుల్లోకి వెళ్తాయని కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే అవసరమైన మెటీరియల్, ట్రాన్స్ఫార్మర్లను డిస్కమ్‌లు అందించలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో మొత్తం పనులు డిస్కమ్ అధికారులే చేయడం సాధ్యపడదని కాంట్రాక్టర్లు చెప్తున్నారు. నూతన విధానాన్ని నిరసిస్తూ పోరాటానికి దిగుతామని విద్యుత్తు కాంట్రాక్టర్ల జేఏసీ చైర్మన్ కందుకూరి శ్రీనివాస్ స్పష్టం చేశారు.
కొత్త చార్జీలు ఇలా..
- ఎల్టీ-1 క్యాటగిరీ వినియోగదారులు ఒక కిలోవాట్ విద్యుత్తు కనెక్షన్‌కు సర్వీస్ లైన్ చార్జి కింద రూ.500 చెల్లిస్తే సరిపోతుంది. 1 నుంచి 5 కిలోవాట్లలోపు కనెక్షన్‌కు రూ.500తోపాటు ప్రతి కిలోవాట్‌కూ రూ.600 చొప్పున చెల్లించాలి. 5 నుంచి 20 కిలోవాట్లలోపు కనెక్షన్‌కు రూ.2,900 కనీస చార్జీతోపాటు ఒక్కో కిలోవాట్‌కూ రూ.1,500 చొప్పున, 20 కిలోవాట్లు దాటితే ప్రతి కిలోవాట్‌కూ రూ.10వేల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.
- ఎల్టీ -2 క్యాటగిరీ వినియోగదారులు ఒక కిలోవాట్‌కు రూ.1,000, ఐదు కిలోవాట్లకు రూ.1,000తోపాటు అదనంగా ప్రతి కిలోవాట్‌కూ రూ.1,200 చొప్పున, 20 కిలోవాట్లకు రూ.5,800తోపాటు అదనంగా ప్రతి కిలోవాట్‌కూ రూ.2 వేల చొప్పున చెల్లించాలి.
- 20 కిలోవాట్లు దాటితే వినియోగదారులు ప్రతి కిలోవాట్‌కు రూ.10 వేలు చెల్లించాలి.
- ఎల్టీ-3 క్యాటగిరీలో పరిశ్రమల యజమానులు 20 కిలోవాట్లకు రూ.40 వేలు, 20 కిలోవాట్లు దాటితే ప్రతి కిలోవాట్‌కూ రూ.10 వేల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

