(జమ్మికుంట), అక్టోబర్ 16: కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఓ చిన్నారి గుండెపోటుతో మృతిచెందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. భూపాలపల్లి జిల్లా పంగిడిపల్లికి చెందిన రాజు-జమున దంపతులకు కొడుకు, కూతురు ఉక్కు(5)ఉన్నారు.
వీరు కొద్దిరోజులుగా జమ్మికుంటలో నివాసం ఉంటున్నారు. మంగళవారం చిన్నారి పాఠశాలకు వెళ్లే క్రమంలో కండ్లు తిరగడంతో తల్లిదండ్రులు స్థానిక ప్రైవేట్ దవాఖానకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి హనుమకొండలోని ఓ దవాఖానకు తరలించగా డాక్టర్లు పరీక్షించి మృతిచెందినట్టు తెలిపారు.