Karimnagar Robbery | రూట్ మార్చిన దోపిడీదొంగలు.. పోలీసుల కంట పడకుండా ఎస్సారెస్పీ కాలువ వెంట పరార్!
Karimnagar Robbery | కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పీఎంజే జ్యువెల్లరీలో ఆదివారం తుపాకులతో బెదిరించి దోపిడీకి పాల్పడిన ఐదుగురు దొంగలు తమ రూట్ మార్చారు.
Karimnagar Robbery | కరీంనగర్, మే 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ రామడుగు : కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పీఎంజే జ్యువెల్లరీలో ఆదివారం తుపాకులతో బెదిరించి దోపిడీకి పాల్పడిన ఐదుగురు దొంగలు తమ రూట్ మార్చారు. ఎస్సారెస్పీ కాలువ వెంట ఉన్నరోడ్డు నుంచి పారిపోయినట్టు తెలిసింది. దొంగల ముఠా మహారాష్ట్రకు చెందినట్టుగా పోలీసులు ప్రాథమిక నిర్ణయానికి వచ్చారు. నగలు దొంగిలించి రెండు బైక్‌లపై దొంగలు పారిపోయారు. కరీంనగర్ శివారు మల్కాపూర్, బైపాస్ గుండా వెలిచాల క్రాస్‌రోడ్డు, అక్కడి నుంచి కొత్తపల్లి, రామడుగు మండలాల మధ్యగల ఎస్సారెస్పీ కాలువ దారిలో రామడుగు మండలంలోకి ప్రవేశించినట్టు పోలీసులు గుర్తించారు.
ఇదే మండలం రుద్రారం దగ్గర లభ్యమైన సీసీ పుటేజీ ప్రకారం చూస్తే.. ఆదివారం ఉదయం 8 గంటల సమయంలో అదే గ్రామం నుంచి ఈ ముఠా రెండు ద్విచక్రవాహనాలపై వచ్చినట్టుగా తెలుస్తున్నది. దోపిడీ జరిగిన తదుపరి కూడా అదే గ్రామంపై నుంచి వెళ్లినట్టు గుర్తించారు. 25 బృందాలు దొంగలను పట్టుకోవడానికి జల్లెడ పడుతున్నాయి. దొంగలు వెళ్తున్నట్టు గుర్తించిన దారుల్లో ఉన్న సెల్టవర్ల నుంచి వివరాలు సేకరించి పరిశీలిస్తున్నారు. ఇక్కడి పరిసరాలు క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి ఆ దొంగల సమూహంలో ఉండి ఉంటారని అనుమానం వ్యక్తంచేస్తున్నారు. రహస్య దారులగుండా వెళ్లడంతోపాటు అందులో ఒకవ్యక్తి తెలుగు భాష మాట్లాడటంపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
Blue Drum Murder | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితులు ముస్కాన్, సాహిల్‌కు మరణశిక్ష
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

