Sangareddy | సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా హత్నూర మండల పరిధిలోని చందాపూర్ శివారులో ఘోర ప్రమాదం జరిగింది. అక్కడున్న ఎస్బీ ఆర్గానిక్ పరిశ్రమలో రియాక్టర్ పేలి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఎస్బీ ఆర్గానిక్ పరిశ్రమ డైరెక్టర్‌తో పాటు నలుగురు కార్మికులు మృతి చెందారు. పలువురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకునన అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసింది. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సంగారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.