ఖలీల్‌వాడి ఆగస్టు 25: నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్‌కు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు హౌస్ సర్జన్లపై వేటు పడింది. ఆరు నెలలపాటు సస్పెండ్ చేయడంతోపాటు హాస్టల్ నుంచి శాశ్వతంగా తొలగిస్తున్నట్టు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కృష్ణమోహన్ తెలిపారు.
అడిషనల్ కలెక్టర్ అంకిత్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, వైస్ ప్రిన్సిపల్ జలగం తిరుపతిరావు తదితరులతో కూడిన యాంటీ ర్యాగింగ్ కమిటీ సోమవారం సమావేశమై ఇరువర్గాల వాదనలు విని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రిన్సిపాల్ తెలిపారు.