Telangana | హైదరాబాద్ : రాష్ట్రంలో ఐదుగురు ఐపీఎస్ ఆఫీసర్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసు పర్సనల్ విభాగం అదనపు డీజీగా సౌమ్య మిశ్రా, ఔషధ నియంత్రణ డైరెక్టర్ జనరల్‌గా కమలాసన్ రెడ్డి, ఏసీబీ డైరెక్టర్‌గా ఏఆర్ శ్రీనివాస్, హోంగార్డు డీఐజీగా అంబర్ కిషోర్ ఝా, మేడ్చల్ డీసీపీగా శబరీశ్ బదిలీ అయ్యారు.