హైదరాబాద్ : ఆదిలాబాద్(Adilabad) జిల్లాలో గాలివాన(Heavy rains) భీబత్సం సృష్టించింది. ఆదివారం ఉరుములు, మెరుపులతో కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో ధాన్యం తడిసిపోయింది. జైన్థ్(Jainad) మండలం పిడుగుపాటుకు ఐదుగురికి గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు గాయపడిన వారిని హాస్పిటల్‌కు తరలించారు. కాగా, మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండలం రామోజీ పల్లిలో పిడుగుపాటుకు (Thunder) తండ్రి,కొడుకు శ్రీరాములు(45), శివరాజు(15)మృతి చెందాడు.
కాగా, రాష్ట్రంలో రాగల నాలుగు రోజులు తెలంగాణవ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.