హైదరాబాద్, జూన్ 17(నమస్తే తెలంగాణ): వేధింపులు లేకుండా స్కూల్ బస్సుల ఫిట్నెస్ను తనిఖీలు చేయాలని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో రవాణా, బీసీ సంక్షేమశాఖలపై ప్రభాకర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
రోడ్డు ప్రమాదాలు జరగకుండా పాఠశాలల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు. గురుకుల పాఠశాలలో ఒక్క సీటు ఖాళీగా ఉండొద్దని అధికారులను ఆదేశించారు. పుస్తకాలు, యూనిఫాంలు అందజేయాలని తెలిపారు.