Fish Distribution | అంతర్గాం, నవంబర్ 6 : ‘ఈ చేప పిల్లలు మాకొద్దు’ అంటూ పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం ఎ ల్లంపల్లిలో మత్స్యకారులు బుధవా రం ఆందోళనకు దిగారు. మత్స్యశాఖ అధికారి నరేశ్ కుమార్, ఫీల్డ్ అసిస్టెంట్ రవి తెచ్చిన చేప పిల్లలు చిన్న సైజులో ఉండటంతో అడ్డుకొన్నారు. ఈ సైజు చేప పిల్లలతో ప్రయోజనం ఉండదని, వచ్చిన దారినే వెళ్లిపోవాలంటూ వెనక్కి పంపించారు.
జాబితాపై అభిప్రాయాలు తెలపండి: సీఈవో
హైదరాబాద్, నవంబర్ 6 (నమ స్తే తెలంగాణ): రాష్ట్రంలో ఓటర్లు నమోదుకు సంబంధించి గత నెల 29న విడుదల చేసిన జాబితాలపై అభ్యంతరాలుంటే తెలపాలని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ఆఫీసర్ (సీఈవో) సుదర్శన్‌రెడ్డి కోరారు. ఈ మేరకు సీఈవో కార్యాలయంలో బుధవారం పలు రాజకీయపార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు.