ఖైరతాబాద్, మే 20: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో వచ్చే నెల 8న ఉదయం11గంటలకు చేప ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు దివంగత బత్తిని హరినాథ్‌గౌడ్ తనయుడు అమర్నాథ్గౌడ్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఆయన మాట్లాడారు. ఆర్టీసీ, జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, మున్సిపాలిటీ, పోలీసుశాఖ తగిన ఏర్పాట్లు చేయాలని, మత్స్యశాఖ వారు కావాల్సిన చేపలను సిద్ధం చేయాలని వినతిపత్రాలు అందించామని తెలిపారు. అగర్వాల్ సేవాదళ్ స్వచ్ఛంద సంస్థ భోజన సౌకర్యాలు, బద్రీ విశాల్ పన్నాలాల్ పిట్టి ట్రస్ట్ చైర్మన్ శరత్పిట్టి సహకారాన్ని అందిస్తున్నారని తెలిపారు. ఉబ్బసం రోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.