Chepa Prasadam | హైదరాబాద్, / సిటీబ్యూరో (నమస్తే తెలంగాణ ) జూన్ 6: మృగశిరకార్తె సందర్భంగా ఈ నెల 8, 9 తేదీల్లో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహించే చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల నుంచి నాంపల్లికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్, గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు గురువారం వేర్వేరు ప్రకటనల్లో వెల్లడించారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, జేబీఎస్, ఎంజీబీఎస్, ఈసీఐఎల్ ఎక్స్‌రోడ్ నుంచి 9 బస్సుల చొప్పున, శంషాబాద్ ఎయిర్‌పోర్టు, దిల్సుఖ్నగర్, ఎన్జీవోస్ కాలనీ, మిథాని, ఉప్పల్, రాజేంద్రనగర్ నుంచి 7 బస్సుల చొప్పున, చార్మినార్, గొలొండ, రామ్‌నగర్, ఈసీఐఎల్, రిసాలబజార్, పటాన్చెరు, కేపీహెచ్‌బీకాలనీ, గచ్చిబౌలి నుంచి నుంచి ఐదు బస్సుల చొప్పున నడపనున్నట్లు పేర్కొన్నారు. బస్సుల సమాచారం కోసం కోటి, రేతిఫైల్లో కమ్యూనికేషన్ సెంటర్లు ఏర్పాటు చేశామని, 9959226160, 9959226154 సెల్ నంబర్లను సంప్రదించవచ్చని సూచించారు.