హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో తొలిసారిగా నిర్వహించనున్న ఇన్ సర్వీస్ టీచర్స్ టెట్ నోటిఫికేషన్ మంగళవారం విడుదల కానున్నది. నోటిఫికేషన్ విడుదలకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు.
దరఖాస్తు చేసుకున్న వారికి సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహిస్తారు. ప్రభుత్వ, స్థానిక సంస్థల ఆధ్వర్యంలోని స్కూళ్లల్లో పనిచేస్తున్న టీచర్లే కాకుండా.. గురుకుల, మాడల్ స్కూల్ టీచర్లు ఈ టెట్‌కు హాజరుకావొచ్చు.