Group-1 Mains | తెలంగాణలో తొలిరోజు గ్రూప్-1 పరీక్ష ముగిసింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 29 రద్దు చేయాలని కోరుతూ గ్రూప్-1 అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. పరీక్షను వాయిదా వేసేందుకు నిరాకరించింది.షెడ్యూల్ ప్రకారం ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు మెయిన్స్ పరీక్షలు మొదలయ్యాయి. ఈ నెల 27 వరకు ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. పలు చోట్ల పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను పోలీసులు కేంద్రాల్లోకి అనుమతించలేదు.
పలుచోట్ల అభ్యర్థులు ఆలస్యంగా రావడంతో వారిని సిబ్బంది పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించలేదు. ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా గేట్లు తాళం వేయడంతో అక్కడే ఉన్న సిబ్బందిని అభ్యర్థులు చాలాసేపు వేడుకున్నారు. గేటు పట్టుకుని రోదిస్తూ దయచేసి పంపించాలని వేడుకున్నారు. కానీ నిబంధనల ప్రకారం అనుమతించేది లేదని సిబ్బంది చెప్పారు. దీంతో చాలామంది వెనుతిరిగారు. సికింద్రాబాద్‌లోని పరీక్షా కేంద్రానికి ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చిన మాథ్యూస్ అనే అభ్యర్థిని పోలీసులు అనుమతించలేదు. దీంతో గోడ దూకి పరీక్ష కేంద్రం వైపు పరుగులుపెట్టాడు. ఇది గమనించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని బేగంపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
గ్రూప్ 1 పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యం.. అనుమతించని అధికారులు
గేటు పట్టుకొని రోదిస్తు దయచేసి పంపించండి అంటూ వేడుకుంటున్న గ్రూప్ 1 అభ్యర్థి. pic.twitter.com/u4LgsyQ9aj
— Telugu Scribe (@TeluguScribe) October 21, 2024
దుండిగల్‌లో ఓ అభ్యర్థిని పొరపాటున తన పరీక్షా కేంద్రానికి కాకుండా వేరే పరీక్షా కేంద్రానికి వెళ్లింది. అక్కడే విధులు నిర్వహిస్తున్న ఓ పోలీసు సిబ్బంది విషయం తెలుసుకుని ఆమెకు సాయం చేశాడు. వెంటనే ఆమెను తన బైక్‌పై ఎక్కించుకుని సకాలంలో సరైన పరీక్షా కేంద్రం వద్ద దింపాడు. ఇలాగే కీసరలో ఓ అభ్యర్థి పరీక్ష కేంద్రానికి రావడం ఆలస్యం కావడంతో.. ఇది గమనించిన ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకటయ్య అతన్ని పెట్రోలింగ్ వాహనంలో గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజీ పరీక్షా కేంద్రానికి తీసుకొచ్చాడు. దీంతో ఆ అభ్యర్థి సజావుగా పరీక్ష రాయగలిగాడు.
శభాష్ పోలీసన్న…!
దుండిగల్ లో ఓ గ్రూప్ – 1 అభ్యర్థి పొరపాటున
తన పరీక్ష కేంద్రానికి కాకుండా వేరే పరీక్షకేంద్రానికి వెళ్లింది.విషయం తెలుసుకున్న పోలీస్ సిబ్బంది…అభ్యర్థిని బైక్ పై తన పరీక్ష కేంద్రానికి సకాలంలో తరలించారు. @TelanganaDGP @cyberabadpolice #Group1Exam… pic.twitter.com/lzH5pKDi5E
— BIG TV Breaking News (@bigtvtelugu) October 21, 2024
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు సంబంధించిన పిటిషన్లు సుప్రీంకోర్టులో ఇవాళ విచారణకు ఉండటంతో పరీక్ష వాయిదా పడుతుందేమోనని అనుకున్నారు. దీంతో పరీక్ష కొనసాగుతుందా? లేదా? అని ఇవాళ మధ్యాహ్నం వరకు ఉత్కంఠ కొనసాగింది. కానీ గ్రూప్-1 మెయిన్స్‌ను వాయిదా వేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు కూడా త్రిసభ్య ధర్మాసనం నిరాకరించింది. మెయిన్స్ పరీక్షల నిర్వహణలో హైకోర్టు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని కోర్టు తెలిపింది. నవంబర్ 20లోగా విచారణ పూర్తి చేయాలని హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇప్పటికే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్న నేపథ్యంలో.. ఈ దశలో పరీక్షల వాయిదాపై జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. దీంతో షెడ్యూల్ ప్రకారం గ్రూప్-1 పరీక్షలు మొదలయ్యాయి. పరీక్ష వాయిదా వేయాలని ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ఎగ్జామ్ సెంటర్ల వద్ద పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. అన్ని కేంద్రాల వద్ద బీఎన్ఎస్ఎస్ 163 సెక్షన్ విధించారు. ఎగ్జామ్ హాల్, చీఫ్ సూపరింటెండెంట్, పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనించారు.
గ్రూప్ 1 పరీక్షకు ఒక్క నినిషం అసల్యం.. గోడ దూకి పరీక్షా కేంద్రం వైపు పరుగులు పెట్టిన అభ్యర్థి
సికింద్రాబాద్ – ఎగ్జామినేషన్ సెంటర్‌కు ఒక నిమిషం ఆలస్యంగా వచ్చిన మాథ్యూస్ అనే గ్రూప్ 1 అభ్యర్థి.
పోలీసులు అనుమతించకపోవడంతో గోడ దూకి పరీక్షా కేంద్రం వైపు పరుగులు పెట్టిన అభ్యర్థి.… pic.twitter.com/u113NGdTE8
— Telugu Scribe (@TeluguScribe) October 21, 2024