హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా తెలంగాణ అగ్నిమాపకశాఖతో వేతనాలు, పెన్షన్లు, ప్రమాదబీమావం టి అంశాలపై అవగాహన ఒప్పందం చేసుకుకున్నది. రాష్ట్ర పోలీసులకు ఇస్తున్న కవరేజీ, సేవలు, ప్రత్యేక ఆఫర్లను అగ్నిమాపకశాఖ సిబ్బందికి కూడా అందించనున్నారు. ఈ మేరక అగ్నిమాపక సేవల శాఖ డీజీ వై నాగిరెడ్డి, బ్యాంక్ ఆఫ్ బరోడా హైదరాబాద్ జోన్ జనరల్ మేనేజర్, జోనల్ హెడ్ రితేశ్ కుమార్ సోమవారం ఎంవోయూపై సంతకాలు చేశా రు.
ఈ ఒప్పందంతో అగ్నిమాపకశాఖ సిబ్బం ది ఎవరైనా తమ బ్యాంకు అకౌంట్కు వస్తే.. పెన్షనర్లకు ప్రత్యేక ఆఫర్లు, ప్రయోజనాలు లభిస్తాయని తెలిపింది. మెరుగైన ఉచిత సమ గ్ర వ్యక్తిగత ప్రమాద బీమా (పీ ఏ ఐ), యోధా రిటైల్ రుణాలపై ప్రత్యేక ఆఫర్లు, డెబిట్, క్రెడిట్ కార్డులు సహా అనేక ఇతర ప్రయోజనాలు అందిస్తామని బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రతినిధులు తెలిపారు. విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.1.30 కోట్ల వరకు వ్యక్తిగత ప్రమాద బీమా డెత్ కవరేజీ, ఆఫ్ డ్యూటీలో మరణిస్తే రూ.1.26 కోట్ల వరకు ప్రయోజనాలు, శాశ్వత వైకల్యం కవరేజీ కింద రూ.80 లక్షల వరకు లభిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో అగ్నిమాపకశాఖ డైరెక్టర్ లక్ష్మీ ప్రసాద్, అడిషనల్ డైరెక్టర్ జీ వెంకట నారాయణరావు, అసిస్టెంట్ డైరెక్ట ర్ సుధాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.