హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి సాధిస్తున్నదని కేంద్ర అర్థ గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ విడుదల చేసిన నివేదిక స్పష్టం చేసిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షు డు బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. దేశంలో అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ వెలుగొందుతున్నదని చె ప్పారు. ఈ గణాంకాలు, వృద్ధిరేటును చూసైనా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కండ్లు తెరవాలని, రాష్ట్ర ప్రభుత్వంపై బుర ద చల్లడం మానుకోవాలని హితవు పలికారు. విమర్శ లు నిర్మాణాత్మకంగా ఉండాలని సూచించారు. ప్రజాప్రతినిధులుగా ఆదర్శంగా ఉండాలని తెలిపారు. సీఎం కేసీఆర్ విజన్, ప్లానింగ్, పాలనా దక్షత, డైనమి క్ నాయకత్వంలో రాష్ట్రం బంగారు తెలంగాణ వైపు పరుగులు పెడుతున్నదని చెప్పారు.
జీఎస్డీపీ, తలసరి ఆదాయంలో రాష్ట్ర వృద్ధి రేటు దేశానికే ఆదర్శంగా నిలిచిందని వినోద్‌కుమార్ తెలిపారు. జీఎస్డీపీలో రాష్ట్రం 11.2% శాతంతో అగ్రగామిగా నిలిచిందని, దేశ తలసరి ఆదా యం రూ.1,49,848 ఉండగా, తెలంగాణలో రూ.2,78,833 ఉన్నదని చె ప్పారు. కేంద్ర నివేదిక ప్రకారమే రాష్ట్రం లో నిరుద్యోగ రేటు 0.7% శాతం మా త్రమేనని వెల్లడించారు. ‘గ్రామీణ ప్రాం తాల్లో పట్టణ స్థాయి సౌకర్యాలు’ కల్పించాలన్న లక్ష్యం తో సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని పేరొన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారని, ఫలితాలు కూడా సాధిస్తున్నారని తెలిపారు. ట్యాక్స్ రెవెన్యూలోనూ దేశ ఎకానమీలో రాష్ట్రం అగ్రభాగాన నిలిచిందని వివరించారు.