హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబరు 12 (నమస్తే తెలంగాణ): ఎన్నిక ఏదైనా తమకేం సంబంధం లేదన్నట్టుగా ప్రవర్తించాడు జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఓటరు. ఎన్నికలు జరిగిన ప్రతిసారి అక్కడ 50 శాతానికి మించి ఓటింగ్ జరగడం లేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) ఇక్కడ 47.49 శాతం మాత్రమే పోలింగ్ నమోదు కాగా, తాజాగా జరిగిన ఉప ఎన్నికలో (By-Election) 48.49 శాతం ఓటింగ్ నమోదైంది. అంటే గతంతో పోలిస్తే ఒక్కశాతం మాత్రమే పెరిగింది. నియోజకవర్గంలో మొత్తం 4.01 మంది ఓటర్లు ఉంటే 1,94,631 మంది మాత్రమే ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నట్టు ఎన్నికల సంఘం అధికారులు బుధవారం అధికారికంగా ప్రకటించారు. Jubilee Hills, Assembly Elections, By-Election
వీరిలో 99,771 మంది పురుషులే కావడం గమనార్హం. బస్తీ ఓటర్లు ఓటు వేసేందుకు ఆసక్తి చూపగా, అపార్ట్మెంట్ ఓటర్లలో చాలా వరకు ఓటు వేసేందుకు ఆసక్తి చూపలేదు. కొత్తగా ఓటుహక్కు వచ్చిన యువత మాత్రం ఓటు వేసేందుకు ఉత్సాహం చూపింది. పోలింగ్ ఒక్కశాతమే పెరగడంతో విజయం బీఆర్ఎస్, కాంగ్రెస్‌లలో ఎవరిని వరిస్తుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 4,01,365
పురుషులు 2,08,561
మహిళలు 1,92,779
ఇతరులు 25
పోలింగ్ మొత్తం: 48.49%
చేసుకున్నవారు 1,94,631
పురుషులు 99,771
మహిళలు 94,855
ఇతరులు ఐదుగురు