హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. రాష్ట్రంలోని 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లకు సంబ ంధించి తుది ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లలో 51,92,220 మంది ఓటర్లు ఉన్నట్టు వెల్లడించింది. ఇందులో 25,37,136 మంది పురుషులు, 26,54,453 మంది మహిళ ఓటర్లు ఉన్నట్టు తెలిపింది. ఇతరులు 631 మంది ఉన్నట్టు పేర్కొన్నది.