నారాయణపేట: సినీ నటి మంచు లక్ష్మి(Manchu Lakshmi )నారాయణపేట జిల్లా (Narayanapet) నారాయ ణపేట మండలం కొల్లంపల్లి ప్రాథమిక పాఠశాలలో డిజిటల్ క్లాస్ రూమ్‌ను(Digital classroom) మంగళవారం ప్రారంభించారు. టీచ్ ఫర్ ఛేంజ్, వేణి రావు ఫౌండేషన్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన డిజిటల్ క్లాస్ రూమ్‌ను స్థానిక ఎమ్మెల్యే పర్ణిక రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు డిజిటల్ క్లాసుల ద్వారా విద్యను అందించడం ధ్యేయంగా తమ ఫౌండేషన్ లక్ష్యం పెట్టుకుందని తెలిపారు.
రోజురోజుకు టెక్నాలజీలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయని వారు పేర్కొన్నారు. మారిన పరిస్థి తులకు అనుగుణంగా టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యలో రాణించాలన్నారు. డిజిటల్ క్లాస్ రూమ్స్ విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని చెప్పారు. టెక్నాలజీలో ప్రైవేట్ స్కూ్ల్స్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఎదుగాలని ఆకాంక్షించారు. భవిష్యత్‌లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడుతామని వారు తెలిపారు.