హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ): కార్మికుల హక్కుల రక్షణ కోసం అవరమైతే పోరాటం చేద్దామని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కార్మికులు, ఉద్యోగులు ఎదురొంటున్న సమస్యలపై బీఆర్ఎస్ కార్మిక విభాగం నాయకులు రాంబాబు, రూప్సింగ్, నారాయణ, మారయ్యతో ఆయన సమావేశం అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖలో ఆశ వర్కర్లు, 104 సిబ్బంది, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, స్త్రీ, శిశు సంక్షేమశాఖ, అంగన్వాడీ, వీవోఏ తదితర రంగాల్లో పనిచేస్తున్న కార్మిక, సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ఆయా ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కిందిస్థాయి సిబ్బందికి నెలవారీ వేతనాలు సహా ఇతర సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చూడాలని కార్మిక నాయకులకు సూచించారు.