హైదరాబాద్,జూన్ 26 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ నేతల మధ్య మళ్లీ ఘర్షణ జరిగింది. ఇందుకు గాంధీభవన్ వేదికైంది. గురువారం హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవ ర్గ సమీక్ష సమావేశం సందర్భంగా మలక్పేట్ కాంగ్రెస్ నేతల మధ్య మా టామాట పెరిగింది. ఎమ్మెల్యేగా పోటీ చేసిన అక్బర్ డీసీసీ పదవి కావాలని పట్టుబడుతున్నారు.
దీనికి ప్రస్తుత డీసీసీ అధ్యక్షుడు సమీర్ వలీ వర్గం అభ్యంతరం చెప్పింది. దీంతో ఇరువ ర్గాల మధ్య తోపులాట చోటుచేసు కుంది. కార్యకర్తలు క్రమశిక్షణ తప్పితే చర్యలు తప్పవని సీఎం, టీపీసీసీ చీఫ్ మహేశ్, మీనాక్షి నటరాజన్ ఇటీవల హెచ్చరించినా ఫలితం లేకుండా పో యిందని దీంతో రుజువవుతున్నది.