జడ్చర్లటౌన్, అక్టోబర్ 27 : పంచాయతీ కార్యదర్శి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో చోటుచేసుకున్నది. స్థానికుల కథనం మేర కు.. అడ్డాకుల మండలానికి చెందిన రాజశ్రీ(39)కి నారాయణపేటకు చెందిన శ్యాం సుందర్‌తో వివాహం కాగా.. వీరికి ఇద్దరు సంతానం. మిడ్జిల్ మండలం వెలుగొమ్ము ల గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తూ జడ్చర్ల వెంకటేశ్వరకాలనీలో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నది.
సోమవారం ఇద్దరు పిల్లలను పాఠశాలకు పంపించిన రాజశ్రీ తర్వాత ఇంట్లోనే చీర తో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. సాయంత్రం పాఠశాల నుంచి వచ్చిన పిల్లలు తలుపులు మూసి ఉండటాన్ని గుర్తించారు. వెంటనే ఇంటి యజమానికి విషయం తెలియజేయగా.. వచ్చి కిటికీలో నుంచి చూశారు. రాజశ్రీ ఆత్మహత్య చేసుకున్నట్టు గుర్తించిన ఆయన వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై మల్లేశ్ ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.