భద్రాచలం, ఆగస్టు 11 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి చెందిన సరితకు మనుబోతుల చెరువు ప్రాంతంలోని డబు ల్ బెడ్రూం సముదాయంలో ఇల్లు కేటాయిస్తున్నట్టు అధికారులు గ్రామసభలో పే రు చదివి వినిపించారు. ఇప్పటివరకు ఇల్లు కేటాయించకపోవడంతో విసిగిపోయిన సరిత సోమవారం పెట్రోల్ బాటిల్తో ఇళ్ల సముదాయం వద్దకు చేరుకుంది. ఓ ఇంటి తాళం పగులగొట్టి అందులోకి వెళ్లి బైఠాయించింది. ఖాళీగా ఉన్న ఇంటిని తనకు కేటాయించాలని, లేదంటే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించింది. విషయం తెలుసుకున్న అధికారులు, పోలీసులు ఆమెతో ఫోన్లో మాట్లాడారు. ప్రతిపాదిత జాబితాలో పేరు ఉన్నదని, ఉన్నతాధికారులతో మాట్లాడి ఇల్లు మంజూరయ్యేలా కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించింది.