హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 13లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడుతున్నదని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ విమర్శించారు. రూ.8 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని శనివారం ఒక ప్రకటనలో డి మాండ్ చేశారు. సర్కార్‌పై ఒత్తిడి పెంచేందుకు ఈ నెల 27న అన్ని కలెక్టరేట్లలోని ప్రజావాణిలో ఫిర్యాదు, 28న మంగళవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లక్ష పోస్టుకార్డులు పంపడం, 29న రాష్ట్రవ్యాప్తంగా అన్ని కాలేజీల బంద్.’ తదితర కార్యక్రమాలు నిర్వహించి విజయవంతం చే యాలని బీఆర్ఎస్వీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బకాయిల సాకుతో కళాశాలల యాజమాన్యాలు స్టూడెంట్లకు ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో వారు ఉద్యోగ అవకాశాలకు దూ రమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కమీషన్ల కోసం కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు
బడా కాంట్రాక్టర్లకు కమీషన్ల కోసం బి ల్లులు చెల్లిస్తున్న ప్రభుత్వం, పేద విద్యార్థుల చదువు కోసం నిధులు ఇవ్వకపోవడం ప్రభు త్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిదర్శనమని విమర్శించారు. ప్రభుత్వం విడుదల చేసే వ రకు విశ్రమించేదాకా ఊరుకోమని చెప్పారు.