హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు ఫిబ్రవరి 1 బ్లాక్ డే అని, కాంగ్రెస్ వికృత చేష్టలకు నిరసనగా నల్ల అంగీలు వేసుకొని నిరసన తెలిపామని ఎస్పీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ చెప్పారు. దొంగతనం చేసిన వాడే దొంగ.. దొంగ అని అరిచినట్టు రేవంత్‌రెడ్డి తీరు ఉన్నదని విమర్శించారు.
తెలంగాణభవన్‌లో ఆదివారం మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ తెలంగాణ దైవమని, అలాంటి నాయకుడిని సిట్ విచారించడాన్ని ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారని తెలిపారు.