నాగర్కర్నూల్ టౌన్, ఆగస్టు 6 : పటియాలాలోని ప్రతిష్టాత్మక నేతాజీ సుభాష్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ (ఎన్ఐఎస్) సెంటర్లో పురుషుల ఖోఖో కోచింగ్ శిక్షణకు నాగర్కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం కార్వంగకు చెందిన మామిళ్లపల్లి రవికుమార్ ఎంపికయ్యాడు.
ఈ శిక్షణకు తెలంగాణ నుంచి ఎంపికైన నలుగురిలో రవికుమార్ ఒకరు. రవి గతంలో తెలంగాణ ఖో ఖో జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు.