షాద్నగర్: రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో (Shadnagar) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వాటర్ ట్యాంకర్ ఢీకొట్టడంతో తండ్రీ కూతురు అక్కడికక్కడే మృతిచెందారు. శనివారం ఉదయం తండ్రీకూతురు మశ్చేందర్, మైత్రి బైక్పై వెళ్తున్నారు. ఈ క్రమంలో షాద్నగర్ చౌరస్తా వద్ద వేగంగా దూసుకొచ్చిన వాటర్ ట్యాంకర్ వారు ప్రయాణిస్తున్న బౌక్ను ఢీకొట్టింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు.
ప్రమాదం నేపథ్యంలో పట్టణంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్యాంకర్ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాలను స్వాదీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.