హైదరాబాద్ : నిజామాబాద్ జిల్లాలో(Nizamabad) తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓకే రోజు తండ్రి, కూతరు మృతి(Father and daughter died) చెందడం పలువురిని కంటతడి పెట్టించింది. ఈ విషాదకర(Tragedy) సంఘటన రెంజల్ మండలం వీరన్నగుట్టలో చోటు చేసుకుందది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన జ్యోతి అనే మహిళ భర్త వేధింపులు తాళలేక ఈ నెల 21న ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
గమనించిన కుటుంబ సభ్యులు నిజామాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న జ్యోతికి తన తండ్రి భోజనం తీసుకెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. తండ్రి చనిపోయిన నిమిషాల వ్యవధిలోనే కుమార్తె జ్యోతి చనిపోవడంతో బంధువుల రోదనలు మిన్నంటాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.