వికారాబాద్ : వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. దైవదర్శనానికి ఆటోలో వెళ్తుండగా మార్గమధ్యంలో ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. యాలాల మండలం జుంటుపల్లి గ్రామానికి చెందిన ఉప్పరి భీమయ్య కుటుంబం శ్రీశైలం దైవదర్శనానికి ఆటోలో ఉదయం బయలుదేరారు.
శ్రీశైలం వెళ్లే దారిలో నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలంలో వీరు ప్రయాణిస్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందడంతో జంటుపల్లి గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. తీవ్రంగా గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకంగా ఉన్నట్లు తెలిసింది. గాయపడ్డ క్షతగాత్రులను తెలకపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.