పాలకుర్తి, ఫిబ్రవరి 19 : ఎండలు ముదురుతుండడంతో విద్యుత్ అధికారులు వ్యవసాయానికి కరెంట్ కోత పెడుతున్నారు. రోజుకు 10 నుంచి 15 సార్లు కరెంట్ తీసేస్తుండడంతో బోర్లు, బావుల్లో ఉన్న కొద్దిపాటి నీటిని వరి, ఇతర పంటలకు పెట్టుకోలేకపోతున్నామని జనగామ జిల్లా పాలకుర్తి మండల రైతులు వాపోతున్నారు. రెండు, మూడు రోజులుగా వ్యవసాయానికి నాలుగైదు గంటలు కరెంట్ పోతున్నదని, అర్ధరాత్రి 12 నుంచి 5 గంటల వరకు ఉండాల్సిన త్రీఫేజ్ కరెంట్‌ను రాత్రి 2 గంటలకు ఇచ్చి ఉదయం 5 గంటలకు తీసేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో 24 గంటల నాణ్యమైన కరెంట్ సరఫరా జరిగిందని రైతులు గుర్తుచేసుకుంటున్నారు. ఎండలు మొదలవుతుండగానే కాంగ్రెస్ ప్రభు త్వం కరెంట్ కోతలు పెట్టడం ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు.
ఎండాకాలం రాకముందే కరెంట్ కోతలు మొదలైనయి. అధికారులు కావాలనే వ్యవసాయానికి కరెంట్ తీసేస్తున్నరు. రెండు, మూడు రోజులుగా పగటి పూట వ్యవసాయానికి 3 గంటల పాటు కోత విధిస్తున్నారు. రాత్రి 12 గంటలకు ఇవ్వాల్సిన విద్యుత్‌ను 2 గంటలకు ఇచ్చి 5 గంటలకు తీసేస్తున్నరు. ఓ పక్క చెరువులు, కుం టల్లో నీరులేక భూగర్భజలాలు అడుగం టి బోర్లు పోయడం లేదంటే.. మరో పక్క కరెంట్ కోతలతో పంట పొలాలు ఎండిపోతున్నాయి. ప్రభుత్వం పగటి పూటే విద్యుత్‌ను అందించాలి.