Fake seeds | నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులు.. ఫెర్టిలైజర్స్ షాప్ ఎదుట ఆందోళన
Fake seeds | నకిలీ విత్తనాలతో( Fake seeds) నష్టపోయిన తమకు న్యాయం చేయాలని కోరుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం తాళ్లపాయకు చెందిన గిరిజన రైతులు ఆందోళన చేపట్టారు.
భద్రాద్రి కొత్తగూడెం : నకిలీ విత్తనాలతో( Fake seeds) నష్టపోయిన తమకు న్యాయం చేయాలని కోరుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం తాళ్లపాయకు చెందిన గిరిజన రైతులు మంగళవారం ములకలపల్లిలోని బాలాజీ ఫెర్టిలైజర్స్(Fertilizers shop) ఎదుట పురుగు మందు డబ్బాలతో బైఠాయించి ఆందోళన(Farmers protested) నిర్వహించారు.
20 మంది రైతులు 40 ఎకరాల్లో యాసంగి వరి సాగు కోసం బాలాజీ ఫెర్టిలైజర్స్‌లో నాగార్జున సీడ్స్ వారి హెచ్ఎంటీ సోనా, ఆర్ఎన్ఆర్ వరి విత్తనాలు కొనుగోలు చేశారు. వీటిని సాగు కోసం వినియోగించగా.. వయసు రాకముందే ఈనిన పొలం అంతా తాలు కంకులు వేసింది. దీంతో నష్టపోయిన రైతులు తమకు న్యాయం చేయాలని కోరుతూ పురుగు మందు డబ్బాలతో దుకాణం ఎదుట ఆందోళన నిర్వహించారు.
పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయకపోతే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని రైతులు పేర్కొన్నారు. కాగా, పది రోజుల క్రితం బాధిత రైతులు స్థానిక ఎమ్మెల్యేను కలిసి తమ గోడు విన్నవించుకున్నా.. నష్టపోయిన పంటలను, రైతులను కన్నెత్తి చూడకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. సంబంధిత అధికారులు స్పందించి న్యాయం చేయాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
KCR | ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
Tamilnadu SIR | తమిళనాడులో సర్ షాక్.. పట్టించుకోకపోవడంతో 50 సీట్లు చేజార్చుకున్న స్టాలిన్ సేన!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

