Sand Mafia | చెక్‌డ్యామ్ ధ్వంసానికి యత్నం..అడ్డుకున్న రైతులు.. ఇసుక మాఫియా పరుగు
భూగర్భజలాలు పెంచాలనే ఉద్దేశంతో నారాయణపేట జిల్లా మరికల్ మండలం రాకొండ, దేవరకద్ర మండలం బస్వాపూర్ గ్రామాల మధ్య వాగులో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన చెక్‌డ్యామ్‌ను ఇసుక మాఫియా బుధవారం తెల్లవారుజామున హిటాచీతో ధ్వంసం చేయడానికి యత్నించింది.
- అడ్డుకున్న రైతులు.. ఇసుక మాఫియా పరుగు
మరికల్, ఏప్రిల్ 29 : భూగర్భజలాలు పెంచాలనే ఉద్దేశంతో నారాయణపేట జిల్లా మరికల్ మండలం రాకొండ, దేవరకద్ర మండలం బస్వాపూర్ గ్రామాల మధ్య వాగులో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన చెక్‌డ్యామ్‌ను ఇసుక మాఫియా బుధవారం తెల్లవారుజామున హిటాచీతో ధ్వంసం చేయడానికి యత్నించింది. వాగు వద్ద శబ్దం రావడంతో గమనించిన రాకొండ బీఆర్ఎస్ సర్పంచ్ గాదం పుల్లప్ప నీటిపారుదల శాఖ అధికారులతోపాటు బస్వాపూర్ గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. పెద్ద సంఖ్యలో చేరుకున్న స్థానికులు చెక్‌డ్యామ్‌ను ధ్వంసం చేయడానికి యత్నిస్తున్న వారిని అడ్డుకోవడంతో ఇసుక మాఫియాకు చెందిన వారు అక్కడి నుంచి పరారయ్యారు. కాగా చెక్‌డ్యామ్ కొంతవరకు ధ్వంసం కావడంతో నీరు వృథాగా పోతున్నది. ఈ ఘటనపై గ్రామస్తులు, చెక్‌డ్యామ్ కాంట్రాక్టర్ వేర్వేరుగా ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు దేవరకద్ర పోలీసులు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

