తిమ్మాపూర్, డిసెంబర్ 2 : వడ్ల కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ రైతులు రోడ్డెక్కారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మం డలం పోరండ్లలో సొసైటీ ఆధ్వర్యంలో ధాన్యం కొనడం లేదని ఆగ్రహించారు. ఈ మేరకు పోరండ్లలో ధర్నా చేశారు. అ నంతరం సొసైటీ కార్యాలయాన్ని మూసి వేశారు. ఆ తర్వాత కూడా ధర్నాను కొనసాగించారు. ధాన్యం తీసుకొచ్చి నెల రోజులైనా కొనడం లేదంటూ మండిపడ్డారు.
ఇటీవల 43కిలోల చొప్పున తూ కం వేసి ట్రాక్టర్లను మిల్లర్ల వద్దకు పంపితే తరుగు పేరిట బస్తాకు మరో ఐదు కిలోలు అదనంగా కట్ చేశారని వాపోయారు. తరుగు పేరిట తీవ్ర నష్టం కలిగిస్తున్నారని మండిపడ్డారు. అధికారులు, సొసైటీ పాలకవర్గ సభ్యులు వెంటనే చొరవ తీసుకొని ధాన్యం కొనుగోలు చేసేలా చూడాలని డిమాండ్ చేశారు. ధాన్యం తూకం వేస్తామని సొసైటీ ఉద్యోగులు హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.