పొతంగల్ : ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని, కాంటా వేసిన వడ్లను వెంటనే మిల్లులకు తరలించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండల కేంద్రంలో రైతులు బుధవారం ఆందోళనకు దిగారు. రోడ్డుపై ద్విచక్ర వాహనాలు అడ్డంగా పెట్టి బైఠాయించారు.
మిల్లుల్లో అన్లోడింగ్ సమస్యతో లారీలు నాలుగైదు రోజులుగా అక్కడే ఉంటున్నాయని, లారీలు రాక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు.