జగిత్యాల రూరల్, డిసెంబర్ 9: రుణమాఫీ చేయాలని కోరుతూ సోమవారం జగిత్యాల కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో అడిషనల్ కలెక్టర్ బీఎస్ లతకు మోరపల్లి రైతులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలోని 150 మంది రైతులకు రుణమాఫీ కాలేదని, ఈ విషయమై సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. రూ.1.50 లక్షల రుణం ఉన్న రైతులకు కూడా మాఫీ కాలేదని, 35 శాతం మంది రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. కనీసం రైతుబంధు ఇస్తే తమకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.
దిలావర్పూర్ ఘటనలో 122 కేసులు?
దిలావర్పూర్, డిసెంబర్ 9: నిర్మల్ జిల్లా దిలావర్పూర్-గుండంపల్లి మధ్య లో ఇథనాల్ ఫ్యాక్టరీ తరలింపు కోసం పో రాడిన స్థానిక రైతులు, ప్రజలపై తాజాగా 122 కేసులు నమోదైనట్టు సమాచారం. గత నెల 26, 27 తేదీల్లో వేలాది మంది రోడ్ల మీదకు రావడంతో దిలావర్పూర్ మరో లగచర్లను తలపించింది. వారితో మాట్లాడేందుకు వెళ్లిన నిర్మల్ ఆర్డీవో రత్న కల్యాణిని నిర్బంధించి, ఆమె వాహనాన్ని ధ్వంసం చేయడంతో ఎట్టకేలకు ప్రభు త్వం దిగివచ్చింది. ఫ్యాక్టరీని తరలిస్తామని కలెక్టర్ ఇచ్చిన హామీ మేరకు స్థానికులు నిరసనలు విరమించారు. ఫ్యాక్టరీ వ్యతిరేక పోరాటంలో ఇప్పటివరకు నమో దైన కేసులను ఎత్తివేస్తామని కలెక్టర్ హామీ ఇ చ్చారు. కానీ, అందుకు వ్యతిరేకంగా పోలీసులు 122 మందిపై కేసులు నమో దు చేశారని, అందులో 18 మంది మహిళలు ఉన్నట్టు వార్తలు వైరల్గా మారాయి. ఆర్డీవో డ్రైవర్ ఫిర్యాదు మేరకు ఈనెల 7న కేసులు నమోదు చేసినట్టు స్థానికులు చె ప్పారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.