పనులు వదిలి.. పడిగాపులు కాస్తూ కొన్ని రోజులుగా యూరియా కోసం రైతులు నరకయాతన పడుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల ప్రణాళికా లోపంతో పాత రోజులు పునరావృతమై అన్నదాతలు నానా అవస్థలు పడుతున్నారు. రాళ్లు, కట్టెలు, ఇటుకలు, చెప్పులు, పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డులను లైన్లలో పెట్టి ఆకలిదప్పికలను వదిలి నిరీక్షించినా ఒక్క బస్తా దొరక్క కడుపు మండి రోడ్డెక్కుతున్నారు.
గురువారం రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల గోదాముల వద్ద రైతులు బారులు తీరారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి పీఏసీఎస్ వద్ద ఇలా ఎగబడ్డారు.