నందిపేట్, సెప్టెంబర్ 19: కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టు రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని రైతులు గురువారం నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేపట్టారు.
మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రైతులను మోసం చేసిందని మండిపడ్డారు. రూ.2 లక్షల రుణమాఫీ, రైతుభరోసా, వరికి రూ.500 బోనస్ అమలు చేయకపోతే రైతుల సత్తా ఏమిటో చూపిస్తామని హెచ్చరించారు. అనంతరం రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు.