సంగారెడ్డి : కాంగ్రెస్ పార్టీ మార్క్ పాలనలో రైతుల కష్టాలు రోజురోజుకు రెట్టింపవుతున్నాయి. ఇన్ని రోజులు నీళ్లు, కరెంట్ లేక కష్టాల పడ్డ అన్నదాతలు ఇప్పుడు విత్తనాల కోసం కోటి కష్టాలు పడుతున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలో(Jogipet) రైతులు విత్తనాల కోసం ధర్నా(Farmers dharna) చేపట్టారు. ఉదయం నుంచి జనుము జీలుగు విత్తనాల కోసం పాస్ బుక్ లను లైన్ పెట్టి రైతుల పడిగాపులు కాశారు.
ఆగ్రోస్ సేవా కేంద్రం నిర్వాహకులు స్థాక్ లేదని చెప్పడంతో ఆగ్రహించిన రైతులు ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు, వ్యవసాయ అధికారులు సర్ది చెప్పడంతో రైతులు వెనక్కి తగ్గారు. కాగా, గత పదేండ్లలో ఇలా విత్తనాల(Seeds) కోసం లైన్లో చెప్పులు, పాసుబుక్కులు పెట్టే పరిస్థితి లేదని రైతులు వాపోయారు.సకాలంలో విత్తనాలు అందజేస్తేనే ప్రయోజనం ఉంటుందని, డిమాండ్ మేరకు ప్రభుత్వం విత్తనాలు సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేశారు.