Thorrur | మహబూబాబాద్ జిల్లాలో మక్క రైతుల ఆగ్రహం..కొనుగోలు కేంద్రాల నిర్లక్ష్యంపై రాస్తారోకో
మహబూబాబాద్ జిల్లాలో మొక్కజొన్న పండించిన రైతులకు కష్టాలు మొదలయ్యాయి.
తొర్రూరు : మహబూబాబాద్ జిల్లాలో మొక్కజొన్న పండించిన రైతులకు కష్టాలు మొదలయ్యాయి. సరైన సమయంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం, కాంటా వేయడంలో జాప్యం వంటి కారణాలతో జిల్లాలోని మార్కెట్ యార్డులు మొక్కజొన్నలతో నిండిపోయాయి. గన్ని బ్యాగులు, లారీల కొరత తీవ్రంగా ఉండటంతో కొనుగోలు ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. దీంతో మార్కెట్ యార్డులన్నీ మక్క బస్తాలతో కిక్కిరిసిపోయి, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తొర్రూరు పట్టణ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పరిస్థితి మరింత దారుణంగా మారింది. కాంటా వేసిన మొక్కజొన్నను పూర్తిస్థాయిలో తరలించకపోవడంతో రైతులు రోజులు తరబడి అక్కడే ఉండాల్సి వస్తోంది. సుమారు 5000 బస్తాల మక్క నిల్వ ఉండగా, లారీల కొరత కారణంగా వాటిని తరలించలేక పోతున్నామని అధికారులు స్వయంగా చెబుతున్నారు. అలాగే సుమారు 25 వేల గన్ని బ్యాగులు అవసరం ఉండగా, కేవలం 5000 బ్యాగులు మాత్రమే సరఫరా చేసినట్లు సమాచారం. ఈ పరిస్థితులపై ఆగ్రహం చెందిన రైతులు సోమవారం మహబూబాబాద్ ప్రధాన రహదారిపై మొద్దులు అడ్డంగా పెట్టి రాస్తారోకో చేపట్టారు.
దీంతో రాకపోకలు పూర్తిగా స్థంభించాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని రైతులను శాంతింపజేయడానికి ప్రయత్నించినప్పటికీ, రైతులు వెనక్కి తగ్గకుండా అధికారుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు. కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నెల రోజులుగా మార్కెట్లో పోసిన మక్కను కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంటా వేసిన బస్తాలను లారీల్లో ఎక్కించే వరకు రైతులే కాపలా కాస్తూ, తమ ఇళ్ల నుంచి భోజనం తెచ్చుకుని మార్కెట్ యార్డుల వద్దే రోజులు గడపాల్సి వస్తోందని వాపోతున్నారు.
గన్ని బ్యాగుల కొరత కూడా రైతులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కొనుగోలు కేంద్రాలను సక్రమంగా నిర్వహించాలని, అవసరమైన గన్ని బ్యాగులు, లారీలు అందుబాటులోకి తీసుకురావాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

