Urea | యూరియా కోసం రైతులు నరకయాతన పడుతున్నారు. ఎముకలు కొరికే చలిలోనే అరిగోస పడుతూ రైతు వేదికల వద్ద పడిగాపులు కాస్తున్నారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి గ్రామంలో రైతు వేదిక వద్ద రాత్రి నుంచే ఎరువుల కోసం బారులు తీరారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండల కేంద్రంలోని గ్రోమోర్ రైతు సేవా కేంద్రం వద్ద తెల్లవారుజాము 3 గంటల నుంచే రైతులు క్యూలైన్లలో నిలబడ్డారు.
చలికి దుప్పట్లు కప్పుకొని, స్వెటర్లు వేసుకుని టోకెన్ల కోసం రాత్రంతా ఉప్పరపల్లి రైతు వేదిక వద్ద జాగరణ చేశారు. వర్షాకాలంలో ఇబ్బందులు పడ్డా యాసంగి పంటకైనా సరిపడా యూరియా అందుతుందని ఆశతో మక్క, వరి పంటలు వేశామని, అయినప్పటికీ తిప్పలు తప్పడంలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
చలిలో యూరియా కోసం ఉదయాన్నే లైన్ కట్టిన రైతులు
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఉప్పలరపల్లి గ్రామంలో రైతు వేదిక వద్ద తీవ్రమైన చలిలో రాత్రంతా రైతుల జాగరణ
క్యూలైన్లలో ఇబ్బందులు పడుతున్న మహిళా రైతులు pic.twitter.com/BprTbrKror
— Telugu Scribe (@TeluguScribe) December 31, 2025
రాష్ట్రంలో యూరియా కొరత లేదని.. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిన్న ప్రకటించారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. కేసీఆర్ పాలనలో నిరంతరం నిల్వ చేసే బఫర్ స్టాక్ 3.50 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 4 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ఉండేది. కానీ యూరియా సరఫరా చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం చావు తెలివితేటలను ప్రదర్శించింది. యూరియా నిల్వలను బస్తాల లెక్కలో 47,68,000 బస్తాలు ఉన్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం చేస్తున్నది. అంటే అంతా కలిపి 2.15 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే అవుతుంది. ఈ లెక్కన రాష్ట్రంలో 12,700 గ్రామాలకు గానూ ఒక్కో గ్రామానికి అందుబాటులో ఉన్నది 376 యూరియా బస్తాలు మాత్రమే. ఇంతలా యూరియా కొరత ఉండటం కారణంగా రైతులు చలికి వణుకుతూ రైతు వేదికలు, సహకర సంఘాల వద్ద పడిగాపులు కాయాల్సిన దుస్థితి వచ్చింది.
తెల్లవారుజామున మూడు గంటల నుండి యూరియా కోసం క్యూ లైన్లో వేచి చూస్తున్న రైతులు
ఖమ్మం జిల్లా కొణిజర్ల మండల కేంద్రంలోని గ్రోమోర్ రైతు సేవా కేంద్రం వద్ద బారులు తీరిన రైతులు
యూరియా కోసం తప్పని రైతుల తిప్పలు pic.twitter.com/mpK7eK7EFY
— Telugu Scribe (@TeluguScribe) December 31, 2025