బిజినపల్లి : రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ కేంద్రాల్లోనే విక్రయించాలని, దళారులను ( Middlemen ) నమ్మి మోసపోవద్దని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి (MLA Rajesh Reddy) అన్నారు. సోమవారం నాగర్కర్నూల్ జిల్లాలోని బిజినపల్లి మండలం మంగనూరు గ్రామంలో ఐకేపీ ( IKP ) మహిళా సంఘాల ఆధ్వర్యంలో యాసంగి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సకాలంలో ధాన్యం కొంటున్నామని తెలిపారు. సన్నరకం వడ్లకు క్వింటాకు రూ. 500 బోనస్ ఇచ్చి ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. అనంతరం మంగనూరు గ్రామ శివారులో కురిసిన అకాల వర్షంతో నేలకొరిగిన పంటలను పరిశీలించారు. నష్టపోయిన రైతులందరిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
పంట నష్టపోయిన రైతుల వివరాలను వ్యవసాయ అధికారులు ఎప్పటికప్పుడు అంచన వేసి ప్రభుత్వానికి పంపించాలన్నారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ బాలరాజు గౌడ్, తిరుపతయ్య, వెంకట స్వామి, కృష్ణారెడ్డి, నాసిర్, కృష్ణ,పరశురాములు, ఈశ్వర్, నాగయ్య, బాలరాజు, పాషా, మల్లికార్జున్, సైదులు తదితరులు పాల్గొన్నారు.